ETV Bharat / state

రాష్ట్రంలో మరో 6 ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స రద్దు: ఆరోగ్యశాఖ - తెలంగాణలో కొత్తగా 6 ఆస్పత్రుల్లో కొవిడ్​ చికిత్స రద్దు

covid treatment canceled
covid treatment canceled
author img

By

Published : May 31, 2021, 8:16 PM IST

Updated : May 31, 2021, 9:00 PM IST

20:14 May 31

మరో 6 ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స రద్దు: ఆరోగ్యశాఖ

  రాష్ట్రంలోని మరో 6 ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స రద్దు చేస్తూ తెలంగాణ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పద్మజ ఆస్పత్రి (కేపీహెచ్‌బీ కాలనీ), లైఫ్‌లైన్‌ మెడిక్యూర్‌ (అల్వాల్‌), టిఎక్స్‌ ఆస్పత్రి (ఉప్పల్‌), మ్యాక్స్‌ కేర్‌ ఆస్పత్రి (హన్మకొండ), లలిత ఆస్పత్రి (వరంగల్‌), శ్రీసాయి రాం ఆస్పత్రి (సంగారెడ్డి) ఉన్నాయి. కొవిడ్‌ బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.  

 ఇప్పటి వరకు 105 ఆస్పత్రులపై 166 ఫిర్యాదులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫిర్యాదులపై విచారణ చేపట్టి, సంబంధిత ఆస్పత్రులకు షోకాజు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. షోకాజు నోటీసులు అందిన తర్వాత 24 గంటల్లోపు సరైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో ఆస్పత్రి లైసెన్సును రద్దుచేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు 16 ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: Corona:రాష్ట్రంలో కొత్తగా 2,524 కరోనా కేసులు, 18 మరణాలు

తెలంగాణ టాప్​న్యూస్​

Last Updated : May 31, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.