కరోనా వంటి విపత్కర సమయంలో పేదలకు నమో కిట్లు అందించడం మంచి ఆలోచనని కార్పొరేటర్ చీర సుచిత్ర అన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్‌లోని రాణిగంజ్, పాన్ బజార్‌లో కార్పొరేటర్ చీర సుచిత్ర 1000 నమో కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. భాజపా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు చీర శ్రీకాంత్ ఈ కిట్లను సమకూర్చారు.
కరోనా రెండో దశ చాలా ప్రమాదకరంగా ఉందని, ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదన్నారు. నమో కిట్లు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇప్పటికే టొబాకో బజార్‌లోని హమాలీలకు పంపిణీ చేశామని స్పష్టం చేశారు.
మరిన్ని నమో కిట్లను డివిజన్‌లోని పలు బస్తీల్లోనూ ఇవ్వబోతున్నామని.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ప్రతాప్, నాయకులు అవినాష్, మదన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తడిచిన ధాన్యం సర్కారే కొంటుంది: గంగుల