ETV Bharat / state

ఖమ్మం, వరంగల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ ​

వరుస వైఫల్యాలతో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్​.. తాజాగా వరంగల్​, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ మేరకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సీనియర్​ నాయకులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్కం ఠాగూర్‌.. గాంధీ భవన్​లో సమావేశం నిర్వహించారు. గ్రేటర్​ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ చేపట్టనున్నారు.

congress review meeting in gandhi bhavan regarding khammam warangal elections
ఖమ్మం, వరంగల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ ​
author img

By

Published : Dec 12, 2020, 7:55 PM IST

వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యుహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్కం ఠాగూర్‌.. సీనియర్ నాయకులతో కలిసి గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ఇన్​ఛార్జి కార్యదర్శులు, పలువురు కార్పొరేషన్‌ పరిధిలోని నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం, వరంగల్​ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల షెడ్యూలు విడుదయ్యే సమయానికి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయాలని ఇన్​ఛార్జి నిర్ణయించారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపని వైనాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు కృషి చేయాలని ఇన్​ఛార్జి సూచించారు.

ఇదీ చదవండి: విద్యాసంస్థల పునఃప్రారంభంపై త్వరలోనే నిర్ణయం : మంత్రి హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.