ETV Bharat / state

కేసీఆర్​కు రేవంత్​రెడ్డి లేఖ.. వెంటనే ఆ నిధులు విడుదల చేయాలంటూ.. - telangana latest news

Revanth reddy letter to KCR: సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ‌ రాశారు. ఎస్‌ఎఫ్‌సీ ద్వారా పంచాయతీలకిచ్చే నిధులు విడుద‌ల చేయాలని లేఖలో పేర్కొన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలని కోరారు. అభివృద్ధి పనుల బిల్లులు చాలావరకు పెండింగ్‌ ఉన్నాయని వివరించారు.

రేవంత్​రెడ్డి
రేవంత్​రెడ్డి
author img

By

Published : Dec 28, 2022, 8:56 PM IST

Revanth reddy letter to KCR: స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పంచాయతీలకు ఇచ్చే నిధులు తక్షణమే విడుద‌ల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం స‌ర్పంచుల‌ హక్కులను కాలరాస్తోందని ఆరోపించిన రేవంత్‌... రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆయన... నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధుల‌ను రాష్ట్ర ప్రభుత్వం దొంగ‌చాటుగా దారి మ‌ళ్లించిందని, ప్రతి నెలా విడుదల చేయాల్సిన రూ.250 కోట్లు గడిచిన 5 నెలలుగా విడుదల చేయ‌లేదని ఆరోపించారు. దీంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అద్వాన్నంగా మారిందని, అభివృద్ధి పనులలో చాలా వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయని విమర్శించారు.

స‌ర్పంచులు అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్‌లకు ఈఎమ్ఐలు కట్టలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక‌పోతున్నారన్న రేవంత్‌ రెడ్డి... అభివృద్ధి పనులకు సంబందించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని లేనిచో సర్పంచుల హక్కుల సాధన కోసం పోరాడ‌తామని స్పష్టం చేశారు. జనవరి 2వ తేదీన ఇందిరాపార్క్ వ‌ద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చేప‌డ‌తామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.