Congress National Leaders Campaign in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 22వ తేదీన తెలంగాణ రానున్న మల్లికార్జున ఖర్గే.. ఆలాంపూర్, నల్గొండ నియోజక వర్గాలల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Priyanka Gandhi Election Campaign Schedule in Telangana : ఇక 24వ తేదీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇరువురు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన తెలంగాణాకు వస్తున్న ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) మూడు రోజుల్లో పది నియోజక వర్గాలల్లో ప్రచార సభల్లోనూ, ర్యాలీల్లోనూ పాల్గొంటారని వివరించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు పాలకుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 4 గంటలకు ధర్మపురి, 25వ తేదీన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజక వర్గాలల్లో ప్రచారం(Election Campaign) నిర్వహిస్తారు. 25వ తేదీ రాత్రికి దిల్లీ వెళ్లనున్న ప్రియాంక గాంధీ, 27వ తేదీన ఉదయం తిరిగి వస్తారు. ఉదయం 11 గంటలకు మునుగోడు, మధ్యాహ్నం 2 గంటలకు దేవరకొండ, 4 గంటలకు గద్వాల్ ప్రచార సభల్లో ప్రయాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు - ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ షెడ్యూల్ :
తేదీ | సమయం (గంటలకు) | ప్రచారం చేసే ప్రాంతం |
నవంబర్ 24 | ఉదయం 11 | పాలకుర్తి |
మధ్యాహ్నం 2 | హుస్నాబాద్ | |
సాయంత్రం 4 | ధర్మపురి | |
నవంబర్ 25 | ఉదయం నుంచి సాయంత్రం వరకు | పాలేరు, ఖమ్మం, వైరా, మధిర |
నవంబర్ 27 | ఉదయం 11 | మునుగోడు |
మధ్యాహ్నం 2 | దేవరకొండ | |
సాయంత్రం 4 | గద్వాల్ |
Rahul Gandhi Election Campaign in Telangana : ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు రాహుల్ గాంధీ తెలంగాణాలో ప్రచారం నిర్వహించనున్నారు. 24వ తేదీన జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్‌లల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తోందో అని ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గ్యారంటీలు, మేనిఫెస్టోను ప్రజలకు మరింతగా వివరించనున్నారు.
Telangana Election Campaign : ఇప్పటికే ఈ ముగ్గురు రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్దులను గెలిపించాలని కోరారు. నవంబర్ 19న ప్రియాంక గాంధీ కొమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగాలు తీస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి - 75 నుంచి 78 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటు పక్కా : భట్టి విక్రమార్క
రేపు రాష్ట్రానికి రానున్న ప్రియాంక గాంధీ - ఇదే ఎన్నికల ప్రచార షెడ్యూల్
ధరణి స్థానంలో 'భూమాత'.. విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్ - రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో