ETV Bharat / state

పార్టీపై జేసీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: కాంగ్రెస్​ నేతలు

author img

By

Published : Mar 17, 2021, 9:46 PM IST

సుధీర్ఘ కాలంపాటు పదవులు అనుభవించిన జేసీ దివాకర్​ రెడ్డి కష్ట కాలంలో పార్టీని వదిలివెళ్లిపోయారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పార్టీపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

congress leaders has condemned the indecent remarks made against the party
పార్టీపై జేసీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: కాంగ్రెస్​ నేతలు

తెదేపా నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిలు తెలిపారు. నిన్న సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయాల్లో సోనియా గాంధీ పాత్ర, తదితర అంశాలపై బాధకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.

పార్టీలో సుదీర్ఘకాలం ఉండి...అన్ని రకాల పదవులు అనుభవించిన జేసీ రాజకీయ స్వార్ధం కోసం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తెదేపాలో చేరారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియా గాంధీ నిర్ణయాన్ని ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.