తెరాస వైఫల్యాలను ఎండగడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ప్రచారంలో భాగంగా రాంగోపాల్ పేట్ డివిజన్లోని నల్లగుట్ట ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి శీలం కవిత పర్యటించారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం పూర్తిగా ప్రజాశ్రేయస్సును మరిచిందని ఆరోపించారు.
రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ఇప్పటివరకు జరగలేదని, పేద ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలకు తాము ఏమి చేస్తామో చెబుతూ కాంగ్రెస్ వల్ల జరిగే అభివృద్ధిని, ఆవశ్యకతను తెలియపరుస్తున్నామని పేర్కొన్నారు. నాలా పూడికతీత విషయంలో తెరాస కార్పొరేటర్ విఫలమవడం వల్లే వరద నీరు ఇళ్లలోకి చేరిందని విమర్శించారు. గతంలో తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. ఇప్పటికీ అవే కనిపిస్తున్నాయి తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: