ETV Bharat / state

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. రాష్ట్రానికి ముగ్గురిని ప్రతిపాదించగా.. ఏపీకి నలుగురు న్యాయమూర్తులను సూచించింది. కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

తెలంగాణకు ముగ్గురు న్యాయమూర్తులు
author img

By

Published : Jul 26, 2019, 6:06 AM IST

Updated : Jul 26, 2019, 8:21 AM IST

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణకు ముగ్గురు... ఆంధ్రప్రదేశ్​కు​ నలుగురు న్యాయమూర్తులను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు సీనియర్ న్యాయవాదులు టి.వినోద్ కుమార్, ఎ.అభిషేక్ రెడ్డి, కె.లక్ష్మణ్​లను సిఫార్సు చేయగా... ఏపీకి సీనియర్ న్యాయవాదులు ఆర్. రఘు నందన్ రావు, బట్టు దేవానంద్, డి.రమేష్, ఎన్.జయసూర్యలను నియమించాలని సూచించింది.

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

న్యాయవాదుల కోటాలో ఏడుగురి పేర్లను గతేడాది అక్టోబరు 9న ఉమ్మడి హైకోర్టు ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత ఏడుగురి పేర్లను కొలీజియం ఖరారు చేసింది. కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

ఇవీచూడండి: తెలంగాణలో మరో ఉప సమరం

Intro:Body:Conclusion:
Last Updated : Jul 26, 2019, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.