ETV Bharat / state

CM KCR: 'కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి కల్పించడమే దళిత బంధు పథకం లక్ష్యం'

వినూత్న పంథాలో లబ్ధిదారులు కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి కల్పించడమే దళిత బంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా పథకాన్ని ప్రవేశపెట్టి.. అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అధికారులను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు.

CM KCR
CM KCR
author img

By

Published : Jul 20, 2021, 5:04 AM IST

రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోన్న తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధివిధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్​లో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్​రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్​రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ డెవలప్ కార్పొరేషన్ ఎండీ పి.కరుణాకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దళితులకు ఎలాంటి పరిశ్రమలను పెట్టిస్తే.. లేదా ఎంతటి పనిని అప్పజెబితే.. సులువుగా చేసుకోగలరో గుర్తించడంతో పాటు.. దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఉపాధి లభ్యత ఎలా ఉంటుందనే అంశాలను అధికారులు ముందుగా గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. దళిత బంధు కార్యాచరణపై త్వరలోనే ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు, ఆయా సంఘాల నేతలతో కార్యశాల నిర్వహిస్తామన్నారు. ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్రంలో 33 జిల్లాలకు చెందిన అధికారులను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. ముందుగా గ్రామాల్లో పర్యటించి.. దళిత కుటుంబాల స్థితిగతులను అర్థం చేసుకోవాలని.. వారి అవసరాలేంటో తెలుసుకుని వారి అభిప్రాయాలను సేకరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

అవగాహన కల్పించాలి..

మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా.. దళితులకు అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. వినూత్న పథకాల రూపకల్పన కోసం ఉన్నతాధికారులు దళితులతో మాట్లాడాలని.. వారి అభ్యున్నతి కోసం పని చేస్తున్న అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలన్నారు. ఒక కుటుంబంలో ఇంటి పెద్దగా మహిళ ఉంటే.. వారికి ఏ విధానం ద్వారా ఉపాధి లభిస్తుందో లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ప్రస్తుతం అమలవుతున్న వివిధ రకాల ఉపాధి పథకాలపై వారికి అవగాహన కల్పించాలని.. ఇప్పటికే ఆ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో అమలు పరుస్తున్న ఇతర ఉపాధి మార్గాలేమున్నాయో పరిశీలించాలని పేర్కొన్నారు. వాటన్నింటిలోనూ.. లబ్ధిదారులు కోరుకున్న స్కీమ్​నే ఖాయం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

గత నెల 27న జరిగిన అఖిలపక్ష సమావేశంలో దళత సాధికారత పథకంపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. స్వీయ ఆర్థిక సాధికారత ద్వారా తమ అభివృద్ధిని తామే నిర్వచించుకుని, నిర్ణయించుకునేలా ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి యూనిట్ల(పరిశ్రమ/ఇతర వనరులు) ఏర్పాటుకు రూ.పది లక్షల ఆర్థిక సాయం చొప్పున ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు ఇస్తామని ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రైతుబంధు మాదిరే సాయాన్ని ఎంపికైన కుటుంబాల పేరిట నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ఆ రోజున తెలియజేశారు.

నెలాఖరులోపు లేదా ఆగస్టు 15న ప్రారంభం..
ఈ నెలాఖరులోపు లేదా ఆగస్టు 15న ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో లేదా కమలాపూర్‌ మండలంలో పెద్దఎత్తున ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: త్వరలో కేసీఆర్ మరో కొత్త పథకం.. భారీగా నిధుల కేటాయింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.