ETV Bharat / state

వివాదాల పరిష్కారమే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేదిగా ఉండాలి: సీజేఐ - CJI Chandrachud Inaugurates Ap Judicial Academy

కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచించారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాజ వద్ద నిర్మించిన ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ భవనాన్ని.. ఆయన ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆన్‌లైన్‌ ద్వారా హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

CJI Chandrachud
CJI Chandrachud
author img

By

Published : Dec 30, 2022, 12:44 PM IST

న్యాయవ్యవస్థలో సాంకేతికత అంతర్భాగమైందని.. సాంకేతిక పరిజ్ఞానం వాడకం వేగంగా పెరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని.. కాజ వద్ద నిర్మించిన జ్యుడీషియల్‌ అకాడమీ భవనాన్ని.. ఆయన ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీలో హైకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. కార్యక్రమంలో పాల్గొని హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కాపీల జారీకి సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌, న్యూట్రల్‌ సైటేషన్‌ ప్రారంభించారు. ఏపీ హైకోర్టు మొదటి వార్షిక నివేదికను సీజేఐ విడుదల చేశారు. ఈ-సర్టిఫైడ్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతోపాటు .. ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.

సాంకేతికత అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై​ చంద్రచూడ్‌ తెలిపారు. నూతన సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టమైన ప్రక్రియ అని.. న్యాయవ్యవస్థ వేగంగా సేవలందించాలంటే మౌలిక వసతులు మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుందని వివరించారు.

న్యాయాన్ని నిలబెట్టేదిగా ఉండాలి: న్యాయవాదులు నల్ల కోటు ధరించడం, తెల్ల చొక్కాలపై నల్ల కోటు ధరించడాన్ని గమనించే ఉంటాం.. తెలుపు, నలుపు.. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలకు గుర్తుగా పరిగణిస్తారని జస్టిస్ డీవై​ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. నిత్య విద్యార్థులుగా ఉంటూ వృత్తి నైపుణ్యం పెంచుకోవాల్సి ఉందని తెలిపారు. వివాదాల పరిష్కారమే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేదిగా ఉండాలన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని సూచించారు.

నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి: న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో అందరి సహకారం అవసరం అని జస్టిస్ డీవై​ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. పెండింగ్‌ కేసులు సత్వరమే పరిష్కరించాలని కోరారు. న్యాయమూర్తులకు సొంత సామర్థ్యాలపై విశ్వాసం ఉండాలని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో సత్వర న్యాయం అందేలా చూడాలని సూచించారు. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే.. నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా లక్ష్యం సాధించవచ్చని జస్టిస్ డీవై​ చంద్రచూడ్‌ సూచించారు.

ఇవీ చదవండి: యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు

'ఇండియా ఫస్ట్​'.. తల్లి మరణించిన బాధలోనూ కర్తవ్యాన్ని మరవని మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.