ETV Bharat / state

తప్పని తిప్పలు.. ఆన్‌లైన్‌ అనుమతులకు సాంకేతిక సమస్యలు..

author img

By

Published : Jul 21, 2020, 9:10 AM IST

కరోనా కోరలు చాస్తోన్న తరుణంలో ఆన్‌లైన్‌ సేవలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారులు మొద్దు నిద్దుర వీడటం లేదు. దరఖాస్తుదారుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఆన్‌లైన్‌ అనుమతుల ప్రక్రియలో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు.

hmda
hmda

కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. కూర్చున్న చోటే దరఖాస్తు చేసుకునేలా.. అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులను సైతం ఆన్‌లైన్‌లోనే ప్రింట్‌ అవుట్‌ తీసుకునేలా డైరెక్ట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(డీపీఎంఎస్‌) పేరిట హెచ్‌ఎండీఏ కొంగొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.

కొన్నేళ్ల నుంచి లేఅవుట్లు, భవన నిర్మాణ, ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌(సీఎల్‌యూ), ల్యాండ్‌ యూజ్‌, ఎన్‌వోసీలు, ఆక్యూపెన్సీ ధ్రువీకరణ పత్రాలను ఈ విధానంలోనే జారీ చేస్తున్నారు. అనుమతుల రూపేణా ప్రతినెలా సగటున రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.

సాంకేతిక సమస్యలు

లాక్‌డౌన్‌ ఎత్తేయడంతో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. దరఖాస్తు చేసే క్రమంలో ధ్రువీకరణ పత్రాలు(ఫైల్స్‌), ఆ తర్వాత షార్ట్‌ ఫాల్స్‌ అప్‌లోడ్‌ కావడం లేదు. రిజిస్ట్రేషన్‌ విలువ నమోదు చేయగానే స్క్రీన్‌పై ఫీజు వివరాలు కనిపించడం లేదు. డ్రాఫ్ట్‌ లేఅవుట్‌ ఉత్తర్వులు రావడం లేదు.

నిబంధనల ప్రకారం దరఖాస్తులు జేపీఏవో నుంచి ఏపీవోకు, ఏపీవో నుంచి పీవోకు, పీవో నుంచి ప్లానింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌ నుంచి కమిషనర్‌కు వెళ్లాలి. కానీ.. కిందిస్థాయిలో పరిశీలన పూర్తి కాకుండానే నేరుగా(జంప్‌) ఉన్నతాధికారులకు వెళ్లిపోతున్నాయి. మళ్లీ ఉన్నతాధికారులు తిప్పి పంపించాల్సి వస్తుంది.

ఎందుకిలా..?

ఒకప్పటితో పోలిస్తే డీపీఎంఎస్‌లో సాంకేతిక సమస్యలు పెరిగాయనే చెప్పొచ్ఛు ఈ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ బాధ్యతను పుణేకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అప్పగించారు.

సదరు సంస్థ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులేమో తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పుణే నుంచి వాళ్లు నగరానికి రావడం లేదు. వీళ్లేమో అక్కడికి వెళ్లడం లేదు.

సాంకేతిక పరిజ్ఞానంపై కనీస అవగాహన లేని అధికారికి ఐటీ విభాగం బాధ్యతలు అప్పజెప్పడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. గతంలో సదరు అధికారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కీలక విభాగాల నుంచి తప్పించి ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

మార్పులు, చేర్పులు ఇంకెప్పుడో..?

ఇటీవల ప్రభుత్వం లేఅవుట్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి లేఅవుట్‌కు 100 అడుగుల వెడల్పు గల అప్రోచ్‌ రోడ్డు ఉండాల్సిందే.

అంతకంటే తక్కువగా ఉంటే డెవలెప్‌మెంట్‌ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన డీపీఎంఎస్‌లోనూ మార్పులు చేర్పులు చేయాలి. కానీ ఇప్పటివరకు చేయలేదు. పాత నిబంధనల ప్రకారమే లేఅవుట్‌ దరఖాస్తు ఉండటంతో దరఖాస్తుదారులు అవాక్కవుతున్నారు. ఇప్పుడు చేయాలా.. వద్దా అంటూ అయోమయానికి గురవుతున్నారు.

ఇదీ చదవండి: భారత్ బయో 'కొవాక్జిన్' పరీక్షలు వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.