హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి బయలుదేరారు. సీఎంతోపాటు ఎంపీలు కేకే, నామా, సంతోష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.
ఇదీ చూడండి : కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌజ్‌కు పొంచిఉన్న ముుప్పు