కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే, ఏపీ ప్రభుత్వం 3రాజధానుల నిర్ణయాన్ని(three capitals for ap news) ఉపసంహరించుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు(PM Modi decision to repeal three Farm Laws). నూతన సాగు చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోందని ప్రకటించారు(PM Modi on Farm Laws news). రైతుల ఆందోళనలకు స్పందించి బిల్లులు వెనక్కి తీసుకుంటూ కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుందన్న చంద్రబాబు.., రైతు సంక్షేమంపై దృష్టి పెడుతున్నామని ప్రధాని చెప్పటం అభినందనీయమన్నారు.
అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించండి
అమరావతి రాజధాని(amaravthi capital news) కోసం 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు 700రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు 13జిల్లాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు(amaravati farmers maha padayatra news). నాటి ప్రతిపక్షనేతతో పాటు సభ్యులంతా రాజధానికి 30వేల ఎకరాలు పైగా కావాలని చెప్తూ అమరావతికి మద్దతు పలకటాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రైతులతో నాటి ప్రభుత్వం చట్టప్రకారమే ఒప్పందం చేసుకోవటంతో పాటు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయన్నారు.
అలా చేస్తే అభివృద్ధికి కొరత ఉండదు
రైతులిచ్చిన భూమితో ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్ల ఆస్తి సమకూరినందున.., సంపద సృష్టి, ఉపాధి కల్పనకు కేంద్రమైన అమరావతిని అభివృద్ధి చేస్తే 13జిల్లాల అభివృద్ధికి నిధుల కొరత ఉండదన్నారు. ఫలితంగా 175నియోజకవర్గాల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని గౌరవించి, మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Chandrababu news today: ఇది గౌరవ సభా.. కౌరవ సభా: చంద్రబాబు