ETV Bharat / state

'రెండేళ్ల వరకు ఏపీ మండలిని కదిలించ లేరు'

ఆంధ్రప్రదేశ్​ శాసన మండలిని రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. మండలిని రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని చెప్పారు. మండలి రద్దు చేసినా ప్రక్రియ పూర్తికి ఏడాదిన్నర పడుతుందన్నారు.

chandra-babu-on-three-capital
author img

By

Published : Jan 24, 2020, 8:13 PM IST

ఏపీ శాసనమండలిపై ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌ వ్యాఖ్యలు దారుణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపారనే ఉక్రోశంతో శాసనమండలిని రద్దు చేయాలనుకోవడం అవివేకమని వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేసే అధికారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఆ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉందని వివరించారు. మండలి రద్దు ప్రక్రియ పూర్తయ్యేందుకు ఒకటిన్నరేళ్లు పడుతుందని చెప్పారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మండలిని తీసుకొస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మండలిలో వైకాపా నేతలు అరాచక శక్తులుగా ప్రవర్తించారని అగ్రహం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్‌ షరిఫ్‌ను వ్యక్తిగతంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారని చంద్రబాబు కొనియాడారు.

రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని చెబుతున్న ఏపీ సీఎం జగన్​... మూడు రాజధానుల ప్రస్తావన ఎలా తెచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. హుద్‌హుద్‌కు, రాజధానికి ఎలా పోలిక తెస్తారని నిలదీశారు. ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కొన్ని ఛానళ్లకు శాసనసభ ప్రసారాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఇదీ చదవండి : 'స్త్రీల కోసం కాల్ సెంటర్​ ఏర్పాటు చేస్తాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.