తమిళనాడు నుంచి మరఠ్వాడా వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్ర జలదృశ్యంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం