ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ఛలో ట్యాంక్‌బండ్ ఉద్రిక్తతంగా మారింది. తెలుగు తల్లి ప్లైఓవర్ వైపు నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ట్యాంక్‌బండ్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. కార్మికులు ఎక్కువ సంఖ్యలో రావటం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొంతమంది మహిళా కార్మికులను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
ఇవీ చూడండి: ఛలో ట్యాంక్‌బండ్ ఉద్రిక్తం... బాష్పవాయువు ప్రయోగం..