‘గత ఏడాది డిసెంబరులో విద్యుత్ వినియోగదారుల హక్కులు-2020’కు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై కొన్ని సూచనలు చేశాం. ఇందులో నెట్‌మీటరింగ్‌కు సంబంధించి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల నుంచి అనేక ప్రతిపాదనలు అందాయి. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ కూడా తమ అభిప్రాయాలను పంపింది. అందుకు అనుగుణంగానే 500 కిలోవాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది’ అని విద్యుత్తు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిబంధనలను పరిశీలించి ఈ నెల 30వ తేదీలోగా అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి ఉపకరించే నిర్ణయమని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు.
మూడు విధానాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు..
నూతన ముసాయిదాలో గ్రాస్‌మీటరింగ్, నెట్‌మీటరింగ్, నెట్ బిల్లింగ్/నెట్‌ఫీడింగ్ అన్న మూడు విధానాలుంటాయని, వినియోగదారు తనకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చని మంత్రిత్వశాఖ ముసాయిదాలో తెలిపింది. ఈ మూడింటి తేడాను కూడా వివరించింది.
గ్రాస్‌మీటరింగ్..
ఈ విధానంలో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తు పూర్తిగా గ్రిడ్‌కు వెళ్తుంది.
నెట్‌మీటరింగ్..
వినియోగదారు తాను ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును వినియోగించుకుంటూ మిగిలింది గ్రిడ్‌కు పంపుతాడు. ఇందులో గ్రిడ్ నుంచి వినియోగదారుడు తీసుకునే విద్యుత్తుకు చెల్లించే ధరనే, సౌరవిద్యుత్తుకూ చెల్లిస్తారు.
నెట్‌బిల్లింగ్ లేదా నెట్ ఫీడింగ్..
గ్రిడ్ నుంచి తీసుకునే దానికి ఒక ధర, గ్రిడ్‌కు పంపేదానికి మరో ధర ఉంటాయి. గ్రిడ్‌లో నిల్వలు ఎక్కువగా ఉన్న సమయంలో సరఫరా చేస్తే ధర తక్కువగా చెల్లిస్తారు. గ్రిడ్‌లో నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో సరఫరా చేస్తే ఎక్కువ ధర చెల్లిస్తారు. ‘దీన్ని టైమ్ ఆఫ్ ది డే టారిఫ్’గా వ్యవహరిస్తారు.
ఇదీ చూడండి: డొల్ల ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి కథ నడిపినట్లు ఆధారాలు