ETV Bharat / state

రుణాలు తీసుకునేందుకు అనుమతివ్వని కేంద్రం.. అదే కారణమా!

State Loans: అప్పులకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, వడ్డీలు సహా ఇతర చెల్లింపుల కోసం... సొంత పన్నుల ఆదాయం, కేంద్ర వాటాతో పాటు రుణాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతుంది. జూన్ సమీపిస్తున్న తరుణంలో రైతుబంధు చెల్లింపుల కోసం మే నెలలో భారీగా రుణం తీసుకోవాలని భావించింది. కానీ, ఇప్పటి వరకు రుణాలకు అనుమతి రాకపోవటంతో ఏం చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

author img

By

Published : May 4, 2022, 5:28 AM IST

loans
loans

State Loans: ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా... రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతించలేదు. రాష్ట్రాల అప్పులు భారీగా పెరుగుతున్నాయంటూ అభ్యంతరాలు లేవనెత్తింది. బడ్జెట్‌లో పేర్కొన్న అప్పులతో పాటు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే ఇతర రుణాల భారంపై ఇటీవల అభ్యంతరం తెలిపింది. అప్పులు, వాటి చెల్లింపులు.. ఇందుకు తగిన ప్రణాళికలు, ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమబెంగాల్, హర్యానా, పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాలు రుణాలు తీసుకునేందుకు కేంద్రం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.

కేంద్రం దృష్టి: రుణాల చెల్లింపుల ప్రణాళికలపై కేంద్రం ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సమాచారం, వివరణలు కోరినట్లు తెలిసింది. బడ్జెట్ ద్వారా తీసుకున్న నిర్దేశిత ఎఫ్​ఆర్​బీఎం చట్టానికి అనుగుణంగా కేంద్రం అనుమతించిన మేర ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాల విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. వాటికి సంబంధించిన వివరాలు, చెల్లింపుల ప్రణాళిక, అందుకు తగ్గ ఆదాయ వనరులు తదితరాలపై పూర్తి వివరాలు అడగ్గా... రాష్ట్ర ప్రభుత్వం నివేదించినట్లు సమాచారం.

బాండ్ల వేలం: నిధుల సమీకరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 53 వేల 970 కోట్లు రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022 - 23 బడ్జెట్‌లో పొందుపరిచింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లను వేలం వేసి ఈ మొత్తాన్ని సమకూర్చుకోనుంది. రుణాల కోసం శుక్రవారం బాండ్లు జారీ చేసి మంగళవారం రోజు ఆర్​బీఐ ద్వారా వేలం వేస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తయినా... ఈ ఏడాది ఒక్క రూపాయి రుణం తీసుకోలేదు. మొదటి త్రైమాసికంలో రూ. 15వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్ నెలలో 3వేలకోట్లు, మేలో 8వేల కోట్లు, జూన్ లో 4వేల కోట్లు తీసుకునేందుకు వివరాలు పంపింది. అయితే కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఏప్రిల్‌లో ఎలాంటి రుణం తీసుకునేందుకు వీలు కాలేదు. మే నెలకు సంబంధించి ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

అటూ ఇటుగా: రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం వాటా సహా గ్రాంట్లు కలిపితే నెలకు రూ. 10వేల కోట్లకు అటూ ఇటుగా ఉంటుంది. వేతనాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులు, ఆసరా ఫించన్లు సహా ఇతరత్రా వ్యయాలతో పాటు బిల్లుల చెల్లింపులు సహా సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు జారీ చేసి రుణాల ద్వారా నిధులు సమకూర్చుకుంటుంది. జూన్ నెల ప్రారంభం నుంచి వానాకాలం రైతుబంధు చెల్లింపులు చేస్తారు. ఇందుకు రూ. 7 వేల 500 కోట్లు అవసరం. దీంతో ఒక్క మే నెలలోనే రుణాల ద్వారా రూ. 8 వేల కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తిరిగి వచ్చాకే అప్పులకు సంబంధించి రాష్ట్రాలకు అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక ఆధారపడి ఉంటుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.