ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట.. రూ.4 వేల కోట్ల సమీకరణకు కేంద్రం అనుమతి

Central gov approval of the Telangana state government to take loans through bonds
రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట.. రూ.4 వేల కోట్ల సమీకరణానికి కేంద్రం అనుమతి
author img

By

Published : Jun 3, 2022, 7:37 PM IST

Updated : Jun 3, 2022, 8:41 PM IST

19:33 June 03

బాండ్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి

అప్పుల విషయంలో.... తెలంగాణ ప్రభుత్వానికి ఉపశమనం కలిగింది. బాండ్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ మేరకు... 4 వేల కోట్లు సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆర్బిఐ నోటిఫికేషన్ ఇచ్చింది. 13 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ చేయగా.. ఈనెల 7న బాండ్లను వేలం వేయనున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో.. బాండ్ల ద్వారా 53వేల కోట్ల రుణం తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించినా... రెండేళ్లుగా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న బడ్జెటేతర రుణాల విషయంలో కేంద్రం అభ్యంతరం తెలిపింది.ఈ కారణంగా ఇప్పటివరకు అప్పులు తీసుకునేందుకు అనుమతి లభించలేదు. ఈ అంశంపై... తెలంగాణ సమర్పించిన వివరణను పరిగణలోకి తీసుకున్న కేంద్రం... ఇప్పుడు 4వేల కోట్ల రుణ సమీకరణకు అనుమతి ఇచ్చింది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 3, 2022, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.