హైదరాబాద్ చైతన్యపురి డివిజన్‌ను అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు. డివిజన్ పరిధిలోని భవానీ నగర్, సాయినగర్ కాలనీలలో రూ. 6.32 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే సహకారంతో చైతన్యపురిలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని కార్పొరేటర్ విఠల్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు పాల్గొన్నారు.