ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: తలకిందులవుతోన్న సామాన్యుని కుటుంబ బడ్జెట్

కరోనా దెబ్బకు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులవుతోంది. కొంతమందికి సగం జీతం.. మరికొంత మందికి అసలు జీతాలు లేక సతమతమవుతూ కుటుంబాలను లాగుతున్నారు. నిత్యావసరాలకు, పండ్లకు, పౌష్టికాహారానికి వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. ఇంటి అద్దెలకే సగం జీతం పోతోంది. ఒకవేళ సొంత ఇల్లు ఉంటే.. ఇంటి రుణం ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. చిరువ్యాపారులు ఆదాయం లేక పెట్టుబడి సైతం రాక సతమతమవుతున్నారు. చిరువ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులకు కుటుంబ అవసరాలు పెరిగి ఆదాయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరగడవుతుందోనని ఎదురు చూస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్: తలకిందులవుతోన్న సామాన్యుని కుటుంబ బడ్జెట్
కరోనా ఎఫెక్ట్: తలకిందులవుతోన్న సామాన్యుని కుటుంబ బడ్జెట్
author img

By

Published : Jul 29, 2020, 1:56 PM IST

సాధారణ రోజుల్లో ఒక కుటుంబానికి కిరాణా ఖర్చు నలుగురికి రూ.4వేల వరకు అయ్యేది. ఇంటి అద్దెలు కనిష్ఠంగా రూ.5వేలు ఉండేవి. దీంతో జీవితం సాఫీగా సాగేది. ఒకనెల ఇబ్బంది అయినా సర్దుబాటు చేసుకునేవారు. గృహ రుణాలకు ఈఎంఐలు చెల్లించేవారు. గృహోపకరణాలు, ద్విచక్రవాహనాలు ఈఎంఐల పద్ధతితో కొనుగోలు చేసేవారు.

కరోనాతో జీవితాలు తలకిందులయ్యాయి. దాదాపు 70శాతం కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫైనాన్స్‌ కంపెనీలు వాయిదాలు కట్టాలని ముక్కు పట్టుకుంటున్నాయి. మరోవైపు కుటంబ బడ్జెట్‌ పెరిగిపోయింది. శానిటైజర్లు, మాస్క్‌లు, పౌష్టికాహారం అదనంగా చేరింది. పౌష్టికాహారంలో ఎక్కువగా డ్రైఫ్రూట్లు ఉన్నాయి. వాటి ధరలు చుక్కలు అంటుతున్నాయి. జీడిపప్పు కేజీ రూ.వెయ్యి ఉంది. బాదం పప్పు రూ.1200, కిస్‌మిస్‌లు రూ.450 చొప్పున విక్రయిస్తున్నారు. ఇంకా పొద్దుతిరుగుడు గింజలు, ఇతర గింజలు ధరలు మండిపోతున్నాయి. దీంతో వీటిని మధ్యతరగతి కుటుంబాలు, నిరుపేదలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు.

ఏపీ కృష్ణా జిల్లాలో దాదాపు 12.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరిలో నిరుపేదల కుటుంబాలు దాదాపు 6లక్షలు. వీరంతా కుటుంబ బడ్జెట్‌ నెలకు రూ.10 వేల లోపు ఉన్నవారే. మిగిలిన 6.50లక్షల్లో 4లక్షల కుటుంబాలు మధ్యతరగతి వారు ఉన్నారు. వీరి ఆదాయం నెలకు రూ.20వేల వరకు ఉంటుంది. ఈ రెండు వర్గాలు నెలసరి ఆదాయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం అంటే.. సమస్యగా తయారైంది. విజయవాడ నగరం, ఇతర పట్టణాల్లో నివాసం ఉండే మధ్యతరగతి వారు తమ సొంతగ్రామాలకు వెళ్లిపోయారు. కొంతమంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లారు.

పనిలేక దిక్కు తోచని స్థితి!

విజయవాడలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం. నెలకు రూ.15వేలు వేతనంతో కుటుంబ నిర్వహణ ఖర్చులు, ఇంటి అద్దె, ఇద్దరి కుమారైలకు పాఠశాలల ఫీజులకు సరిపోయేవి. లాక్‌డౌన్‌ తో నేను పనిచేసే సంస్థను తాత్కలికంగా మూసివేశారు. మార్చి నెల నుంచి వేతనం రావడం లేదు. కుటుంబ నిర్వహణ, ఇంటి అద్దె, ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నాను. ఉపాధి లేక ఇంటి వద్ద ఖాళీగానే ఉంటున్నాను.

- ఆనంద్‌ కుమార్‌, ఉయ్యూరు.

ట్యూషన్‌ చెప్పె పరిస్థితి ఏదీ..?

నేను 10సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. నెలకు 20వేలు ఇచ్చేవారు. ఉదయం, సాయంత్రం సమయాలలో ఇంటి వద్దనే ట్యూషన్‌ చెబుతాను. ఇంటి అద్దె రూ.4500 ఒక నెల ఆపితే ఇంటి యాజమాని నిలదీశాడు. దీంతో పొదుపు నగదులో అద్దెను యాజమానికి కట్టాను. ట్యూషన్‌ చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. నాలాంటి వారు చాలా మంది ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారు.

- సూర్యప్రకాష్‌, వన్‌టౌన్‌

కిరాయి రావడం లేదు

మాది భవానీపురం. ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆటో నడిపేవాడిని. గతంలో రూ.500 వచ్చేవి. ప్రస్తుతం రోజుకు రూ.200 రావడం లేదు. ఆటో కిస్తిలు కట్టలేకపోతున్నా. లాక్‌డౌన్‌కు ముందు కాలంలో నైట్‌ డ్యూటీలు చేసి అదనంగా వచ్చే నగదుతో కొంత మొత్తం పొదుపు చేసుకునే వాడిని. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

- సైదులు, ఆటో డ్రైవర్‌

అద్దె కట్టలేకపోతున్నాం..!

మాది కొత్తపేట. అద్దె ఇంటిలో ఉంటాం. అద్దె కూడా చెల్లించలేకపోతున్నాం. వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చాం. నాకు నెలకు రూ.15వేలు, నాభార్యకు రూ.5వేల వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పనులు లేవు. దీంతో కుటుంబాన్ని నడపలేకపోతున్నాను. ఇంట్లో పనులకు కూడా ఎవ్వరూ పిలవడం లేదు. కూలీ పనులు దొరకడం లేదు.

- రవి, ముఠా కూలీ

ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.