BRS Public Meeting in Maharashtra Today: దేశమంతా తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలనే సంకల్పంతో ఆవిర్భవించిన బీఆర్ఎస్.. తన తొలి రాష్ట్రేతర సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే సభ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నాందేడ్‌లో కేసీఆర్ కటౌట్‌లు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి. మహారాష్ట్రలోని తెలంగాణ సమీప గ్రామాల నుంచి కూడా ప్రజల్ని సభకు తరలించనున్నారు.
పలువురు మరాఠా నాయకులు.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నాందేడ్ గురుద్వార్ మైదానంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహారాష్ట్రలోని తెలుగువారు, మైనార్టీ ప్రజలున్న ప్రాంతాల్లో, మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు జడ్పీ ఛైర్‌పర్సన్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లతోపాటు పదుల సంఖ్యలో కౌన్సిలర్లు, సర్పంచులు కారెక్కుతారని తెలుస్తోంది.
నాందేడ్ సభ కోసం ఇవాళ మద్యాహ్నం 12 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయిలుదేరుతారు. 12 గంటల 30 నిమిషాలకు నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో గురుద్వార్‌కు వెళ్లి మొక్కులు సమర్పించుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు అక్కడి బహిరంగసభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌కు రానున్నారు. నాందేడ్ సభ మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందని తనను కలిసి మరాఠా నేతలతో కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: