ETV Bharat / state

రాజ్​భవన్‌లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ మహిళా నేతల యత్నం.. ఉద్రిక్తత - ఈడీ విచారణలో కవిత

BRS leaders protest at Raj Bhavan: హైదరాబాద్​లోని రాజ్​ భవన్​ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు బీఆర్​ఎస్​ మహిళా నేతలు యత్నంచగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

BRS leaders protest
BRS leaders protest
author img

By

Published : Mar 11, 2023, 5:20 PM IST

Updated : Mar 11, 2023, 7:09 PM IST

BRS leaders protest at Raj Bhavan: హైదరాబాద్​లోని రాజ్​భవన్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గవర్నర్​కు ఫిర్యాదు చేసేందుకు మేయర్ విజయ లక్ష్మి నేతృత్వంలో బీఆర్​ఎస్​ నేతలు రాజ్​భవన్​కు వచ్చారు. వారు సాయంత్రం 5 గంటలకు గవర్నర్​ను కలిసేందుకు ఉదయమే అపాయింట్​మెంట్ అడిగారు. దీనిపై రాజ్​ భవన్​ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

ఆ క్రమంలో 5 గంటల సమయంలో పెద్ద ఎత్తున బీఆర్​ఎస్ మహిళ​ అభిమానులు, నగర మేయర్​ విజయలక్ష్మీ, ఆ పార్టీ మహిళా కార్పొరేటర్లు రాజ్‌భవన్‌ వద్దకు చేరుకున్నారు. వారికి లోనికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని పోలీసులు ముందుగానే ఊహించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన బీఆర్​ఎస్​ నేతలు రాజ్ భవన్ ముందు ధర్నాకు దిగారు. ముందుగానే అపాయింట్​మెంట్ అడిగినా గవర్నర్ స్పందించ లేదని మేయర్ మండిపడ్డారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని కవితకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

రాజ్ భవన్ ముందు ధర్నాతో ఆ రోడ్​ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా చేరుకున్న బీఆర్​ఎస్ కార్యకర్తలు, పోలీసులతో రాజ్ భవన్ ముందు గందరగోళం నెలకొంది. కాసేపు నిరసనకు దిగిన గులాబీ శ్రేణులు అక్కడి నుంచి ట్యాంక్ బండ్​కు బయలుదేరారు. ట్యాంక్​ బండ్​పై ఉన్న డా బీఆర్​ అంబేద్కర్​ విగ్రహం వద్దకు చేరుకొని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. బీఆర్ఎస్​ నేతల ర్యాలీతో ట్యాంక్​ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

"మహిళా వారోత్సవాలు జరుగుతున్న వేళ కవితపై బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఆయన తక్షణం కవితకు క్షమాపణ చెప్పాలి. ప్రతి మహిళకు ఆయన క్షమాపణ చెప్పాలి. గవర్నర్​ మా వినతి పత్రం తీసుకోవాలి. ఉదయం నుంచే గవర్నర్​ అపాయింట్​మెంట్​ కోరితే ఇంత వరకు ఇవ్వలేదు. కనీసం ఆమె నుంచి స్పందన రాలేదు."-విజయలక్ష్మి హైదరాబాద్​ మేయర్

రాజ్​భవన్‌లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ మహిళా నేతల యత్నం.. ఉద్రిక్తత

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్​ అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్​ నేతలు మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. బండి సంజయ్​ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కేసుల నమోదుపై న్యాయ సలహా తీసుకుంటున్న పోలీసులు.. అన్నీ ఒకే తరహా ఫిర్యాదులు కావడంతో ఒక పీఎస్‌కు బదిలీ చేసి దర్యాప్తు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు.. విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

'దర్యాప్తు సంస్థల్ని ప్రధాని మోదీ ఉసిగొల్పుతున్నారు'

'కవితమ్మా ధైర్యంగా ఉండండి.. ఈడీ దర్యాప్తును యావత్ దేశం గమనిస్తోంది'

Last Updated : Mar 11, 2023, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.