ETV Bharat / state

ఎంసెట్ ఇంజినీరింగ్​లో బాలురదే పైచేయి... - ఎంసెట్ లో అబ్బాయిలదే పైచేయి

ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో బాలురు పైచేయి సాధించారు. లక్ష 19 వేల 183 మంది హాజరు కాగా.. 89 వేల 734 మంది ఉత్తీర్ణులయ్యారు. తొలి పది ర్యాంకులను ఐదుగురు తెలంగాణ విద్యార్థులు, ఐదుగురు ఏపీ అబ్బాయిలు సాధించారు. ఈనెల 9న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరోనా కారణంగా రాయలేక పోయిన వారికి ఈనెల 8న వ్రత్యేక ఎంసెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఎంసెట్ ఇంజినీరింగ్ లో బాలురదే పైచేయి... 8న ప్రత్యేక ఎంసెట్

author img

By

Published : Oct 6, 2020, 7:27 PM IST

ఎంసెట్​లో మరోసారి అబ్బాయిలు పైచేయి సాధించారు. ఈ ఏడాది లక్ష 19 వేల 183 మంది ఎంసెట్ రాయగా.. వారిలో 75.29 శాతంతో 89 వేల 734 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 48 వేల 781 మంది ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 31 వేల 947 మంది ర్యాంకులు సాధించారు. మైనారిటీలు 7 వేల 530 మంది రాయగా.. 52.81 శాతంతో 5 వేల 120 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు 89 మంది 121 నుంచి 160 మార్కులు.. 3 వేల 293 మంది 81 నుంచి 120 మార్కులు... 77 వేల 629 మంది 40 నుంచి 80 మధ్య మార్కులు సాధించారు. సీబీఎస్ఈ చదివిన విద్యార్థుల్లో 28 మంది 121 నుంచి 160 మార్కులు... 111 మంది 81 నుంచి 120 మార్కులు... 1,172 మంది 40 నుంచి 80 మధ్య మార్కులు సాధించారు.

మార్కుల వారీగా...

ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు 8 వేల 799 మంది ఎంసెట్ రాయగా... వారిలో 6 వేల 46 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా 4 వేల 939 మంది 40 నుంచి 80 మధ్య మార్కులే సాధించారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు 409 రాయగా.. 179 ఉత్తీర్ణత సాధించారు. వారిలో 284 మంది 80లోపు మార్కులే సాధించారు. మొత్తం అర్హత సాధించిన 80 వేల 728 మందిలో 79 వేల 201 మందికి 80లోపు మార్కులే వచ్చాయి.

హైదరాబాదీకి మొదటి ర్యాంక్...

ఈ ఏడాది మొదటి పది ర్యాంకులు బాలురే సాధించారు. ఐదు తెలంగాణ, మరో ఐదు ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. హైదరాబాద్ విద్యార్థి సాయితేజ వారణాసి 147 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా.. ఏలూరు విద్యార్థి కాపెల్లి యశ్వంత్ సాయి రెండో ర్యాంకు దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విద్యార్థి తమ్మనబోయిన మణివెంకట కృష్ణ మూడో ర్యాంకు, హైదరాబాద్ విద్యార్థులు సీహెచ్ కౌశల్ కుమార్ రెడ్డి నాలుగో ర్యాంకు, హార్ధిక రాజ్ పాల్ ఐదో ర్యాంకు సాధించారు.

మిర్యాలగూడ విద్యార్థి నాగెళ్లి నితిన్ సాయి ఆరో ర్యాంకు, గుడివాడ విద్యార్థి కృష్ణ కమల్ ఏడో ర్యాంకు, మంచిర్యాలకు చెందిన అన్నం సాయివర్ధన్ 8వ ర్యాంకు, గుంటూరు విద్యార్థి సాయి పవన్ హర్షవర్ధన్ తొమ్మిది, విశాఖపట్నం అక్కయ్యపాలెం విద్యార్థి వీవీ సిద్ధార్థ్ పదో ర్యాంకు సాధించారు. అగ్రర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎక్కువగా జేఈఈ అడ్వాన్స్​డ్ మెయిన్స్ లో మంచి ర్యాంకులు సాధించిన వారే ఉన్నారు.

8న ప్రత్యేక పరీక్ష...

కరోనా సోకడం వల్ల ఎంసెట్ రాయలేకపోయిన వారి కోసం ఈనెల 8న ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఆన్ లైన్ లో పరిశీలించి నిర్ధరించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

త్వరలో ఖరారు...

తెలంగాణ స్థానికత ధ్రువీకరణ కోసం స్టడీ సర్టిఫికెట్లను మాత్రమే కేంద్రాల్లో భౌతికంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటాపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయనే విషయాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీచూడండి: తెరాస అభివృద్ధిని ఆదరించి ఆశీర్వదించండి: హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.