హైదరాబాద్ రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ 279 వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చేతులు ఛిద్రమయ్యాయి. క్షతగాత్రుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్‌కు చెందిన అలీగా పోలీసులు గుర్తించారు
అసలేం జరిగిందంటే...
ఫుట్‌పాత్‌పై పాలిథీన్ కవర్లో పేలుడు పదార్థం ఉండగా... ఆ సంచిని తెరిచేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఈ క్రమంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో వచ్చి తనిఖీలు చేశారు. ఈ ప్రమాదంపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఘటనస్థలికి చేరుకుని ఆరా తీశారు. రాజేంద్రనగర్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.