ETV Bharat / state

300 అడుగుల లోతులో బోటు... సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం

ఏపీ తూర్పుగోదావరి జిల్లా పర్యాటకులతో వెళ్తూ గోదావరి నదిలో మునిగిన పడవ వందల అడుగు లోతులో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంతో ప్రమాదకరమైన ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మరో వైపు ఈ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది.

300 అడుగుల లోతులో బోటు... సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం
author img

By

Published : Sep 16, 2019, 5:56 AM IST

Updated : Sep 16, 2019, 7:30 AM IST

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురైన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన ఆ బోటు గోదావరి నదిలో 300 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారుల అంచనా వేశారు. ఈ ప్రాంతం ప్రమాదకరమైనది కావడం వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కష్టాలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు అంత సులువు కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

కచ్చులూరు వెళ్లడానికే సరైన మార్గం లేదు. నదీ మార్గాన వెళ్లాలన్న దేవీపట్నం నుంచి గంటన్నర ప్రయాణించాలి. మొన్నటి దాకా ఈ ప్రాంతమంతా వరద బారిన పడి బురదతో నిండిపోయింది. దీనికి తోడు ఇప్పుడీ ప్రమాదం ముంచుకురావటంతో సహాయక చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వాడపల్లి వద్ద లాంచీ ప్రమాదం జరిగినప్పుడు రెండు వైపుల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తేనే చాలా సమయం పట్టింది. ఇప్పుడు గోదావరిలో లోతైన ప్రదేశంలో సహాయక చర్యలు అంత సులభం కాదని నిపుణులు వివరిస్తున్నారు. "ఇది అత్యంత ప్రమాదకర ప్రాంతం. ఇక్కడ సుడిగుండాలుంటాయి." అని బోట్​ అక్కడికి చేరుకున్న సమయంలో టూరిస్ట్​ గైడ్ ఒకరు మైక్​లో పర్యాటకులకు వివరించారు. అదే సమయంలో బోటు ప్రమాదం జరిగిందని కొందరు తెలిపారు.

ఇదీచూడండి: 17 మంది తెలంగాణ వాసులు సురక్షితం

Intro:ap_atp_63a_15_gramsthula_dharna_av_ap10005(updated)
________:_______* పోటాపోటీ ధర్నాలతో ఉద్రిక్తత....
------------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి గ్రామంలో మొహరం వేడుకల సందర్భంగా జరిగిన వివాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మొహరం సందర్భంగా గ్రామంలో ఓ వర్గం వారు దళితులను కించపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా నిర్వహించారు. అయితే తమ వర్గం వారిని అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ మరో వర్గం వారు ఆదివారం రాత్రి కళ్యాణదుర్గం -అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేయగా ధర్నా చేస్తున్న మహిళలు గ్రామంలోని యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగి తమకు న్యాయం చేసే వరకు ఆందోళన చేపడతామని భీష్మించారు. స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ గ్రామానికి చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా
Last Updated : Sep 16, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.