అన్ని దానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్ తెలిపారు. కార్ఖానా పోలీసులు లయన్స్ క్లబ్ సంయుక్తంగా కార్ఖానా నూతన పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్ చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
కార్ఖానా పోలీసు సిబ్బందితో పాటు స్థానిక యువతీయువకులు కూడా ఉత్సాహంగా రక్తదానం చేశారు. 100 మందికి పైగా రక్తదానం చేశారని 108 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రక్తదానం చేయడం మూలంగా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు నడుమ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కార్ఖానా ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామిని డీసీపీ కలమేశ్వర్ అభినందించారు.
ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ