BJP On Unemployment in Telangana : హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (BJP Protest at Indira Park ) ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉదయం 11:00 గంటల.. నుంచి రేపు ఉదయం 11:00 గంటల వరకు 24గంటల దీక్ష చేపట్టారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిరుద్యోగ యువత కోసం 24 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్జి తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఒక పూట తింటూ.. మరో పూట తిండిలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం, వివక్షత చూపుతుందని మండిపడ్డారు.
Kishan Reddy On CM KCR Over Unempolyment : నిరుద్యోగ యువత రాష్ట్రం కోసం పోరాటం చేశారని.. 1200 మంది తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. తద్వారా ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. కేసీఆర్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. వీటిపై పోరాటం చేస్తే బండి సంజయ్‌పై కేసులు పెట్టారని కిషన్‌రెడ్డి (kishanReddy) మండిపడ్డారు.
kishanReddy Comments on BRS and Congress : రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల నుంచి డీఎస్సీ వేయలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పదమే వినిపించదని.. అందరినీ క్రమబద్ధీకరిస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదని.. బీఆర్ఎస్ హత్య చేసిందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికి వచ్చాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిధులు ముఖ్యమంత్రి కుటుంబానికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు వస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో వాటా లేకుండా పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదని.. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారని ఆక్షేపించారు. బంగారు తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అన్ని రకాలుగా విఫలమైందని.. అందుకే బీఆర్ఎస్పై.. రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణలో విప్లవం మొదలైందని అన్నారు.
"తెలంగాణ కోసం 1,200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రం సిద్ధించినా ఇప్పటికీ యువతకు ఉద్యోగాలు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి యువతపై ధ్యాస లేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్డునపడ్డారు. 9 ఏళ్ల నుంచి డీఎస్సీ వేయలేదు. నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది?. కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థిక సాయం చేసి కాంగ్రెస్‌ను కేసీఆర్ బలోపేతం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు యువత బుద్ధి చెప్పాలి." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సీఎంకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో విప్లవం మొదలైందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ నిరసన కార్యక్రమంలో బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జి మురళీధర్ రావు, ఎమ్మెల్సీ ఏవీ.ఎన్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Amit Shah Telangana Tour : సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా
kishan Reddy Comments on BRS : 'వంట గ్యాస్, పెట్రో రేట్లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు'