ముఖ్యమంత్రి కేసీఆర్పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేడ్కర్ భవన్ వద్ద భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి మూడున్నర సంవత్సరాలైనా నిర్మాణం చేపట్టలేదని నిలదీశారు. నూతన అసెంబ్లీ, సచివాలయం పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇవీ చూడండి: 'అనవసర అంశాలు ప్రస్తావనకు రాకుండా చూడండి'