ETV Bharat / state

జోరుమీదున్న భాజపా.. సత్తా చాటేందుకు వ్యూహాలు

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న భాజపా వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికలతో పాటు వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలోనూ విజయమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బలమైన అభ్యర్థుల కోసం ఆన్వేషిస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. వరుస ఎన్నికల్లోనూ విజయం సాధించి తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేననే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

జోరుమీదున్న భాజపా... వచ్చే ఎన్నికల్లోనూ సత్తా చాటేలా వ్యూహాలు

author img

By

Published : Dec 8, 2020, 8:44 PM IST

తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నుంచి జీహెచ్‌ఎంసీ వరకు భాజపాకు అనుకూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో కమలం గాలి వీస్తోందని భావించిన జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

కమలనాథుల యోచన...

దక్షిణ భారతదేశంలో కేవలం కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉన్న భాజపా... తెలంగాణలోనూ కాషాయజెండా ఎగరవేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కమలనాథులు యోచిస్తున్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ భాజపానే విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది మార్చిలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ‌ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా భాజపా నేత రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానంలో క్రితంసారి తక్కువ ఓట్లతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది.

జోరు కొనసాగించేలా...

ఈసారి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం రాంచందర్‌రావుకే తిరిగి కేటాయించింది. వరంగల్‌-నల్గొండ-మహబూబ్‌నగర్ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి వీరిద్దరి పేర్లు మాత్రమే జాతీయ నాయకత్వానికి రాష్ట్ర శాఖ పంపించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం వల్ల అదే జోరును రెండు పట్టభద్రుల స్థానాల్లో కొనసాగించాలని భావిస్తోంది.

బలమైన అభ్యర్థి కోసం...

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం నుంచి తెలంగాణ జేఏసీ కన్వీనర్‌, తెజస అధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగుతుండడం వల్ల ప్రేమేందర్‌ రెడ్డి కాకుండా మరో బలమైన నేతను దింపాలని యోచిస్తోంది. ప్రేమేందర్‌ రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో తన ప్రచారాన్ని ప్రారంభించారు.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నరసింహాయ్య మృతి చెందగా ఆ స్థానానికి ఆరు నెల్లలోపు ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఈ స్థానంలో గెలిచి తెరాసను గట్టిగా దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. తెరాసను ఎదుర్కొనే బలమైన అభ్యర్థి కోసం భాజపా అన్వేషిస్తోంది.

సంప్రదింపులు..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిని, ఆయన కుమారుడిని పార్టీలోకి రప్పించి బరిలోకి దించాలని భావిస్తోంది. అందుకోసం జానారెడ్డి, ఆయన కుమారుడితో సంప్రదింపులు జరుపుతోంది. చేరికపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

తెరాస... నోముల నరసింహాయ్య కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయిస్తే ఆ పార్టీ నేత కోటిరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ కోటిరెడ్డికి తెరాస టికెట్ కేటాయిస్తే నోముల కుటుంబ సభ్యులను చేర్చుకొని బరిలోకి దింపాలని యోచిస్తోంది.

నకిరేకల్​కు కిషన్​రెడ్డి?

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఈనెల 11న నోముల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నకిరేకల్​కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు నాగార్జునసాగర్‌లో గెలిస్తే ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్లి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయానికి దోహాదం చేస్తాయని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్‌ బంద్‌ను విజయవంతం చేసిన విపక్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.