పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు పరామర్శించారు. రాజాసింగ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగాల్ తరహా హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ రామచందర్ రావు హెచ్చరించారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం కల సాకారమైన వేళ..!