ETV Bharat / state

చార్మినార్ ఎమ్మెల్యే రిగ్గింగ్​కు పాల్పడ్డారంటూ భాజపా ధర్నా

గ్రేటర్​ ఎన్నికల పోలింగ్​లో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్​ ఖాన్ అధికారులను బెదిరించి రిగ్గింగ్​కు పాల్పడారంటూ భాజపా ధర్నాకు దిగింది. చార్మినార్ నియోజకవర్గ భాజపా ఇన్​ఛార్జ్​ ఉమామహేంద్ర ఆధ్వర్యంలో డీఆర్​సీ కేంద్రం వద్ద కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేను అరెస్ట్​ చేసి రీపోలింగ్ నిర్వహించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.

BJP dharna alleges Charminar MLA rigging in poorannapool poling booth
చార్మినార్ ఎమ్మెల్యే రిగ్గింగ్​కు పాల్పడ్డారంటూ భాజపా ధర్నా
author img

By

Published : Dec 1, 2020, 10:22 PM IST

పూరానాపూల్ డివిజన్​లోని 18 పోలింగ్​బూత్​లలో ఇష్టారాజ్యంగా రిగ్గింగ్​కు చేశారంటూ పాతబస్తీ సిటీ కళాశాల డీఆర్సీ కేంద్రం వద్ద భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్​ ఖాన్​ తన అనుచరులతో వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ భాజపా ఇన్​చార్జ్ ఉమామహేంద్ర ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యేను అరెస్ట్​ చేసి అన్ని పోలింగ్​బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.

భాజపా అభ్యర్థి సురేంద్రకుమార్ ప్రిసైడింగ్​ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ధర్నాకు దిగారు. రిటర్నింగ్ అధికారి, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ ఉమామహేంద్ర, సురేంద్రకుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, కునాల్, బల్వీర్​ సింగ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గ్రేటర్​ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.