ETV Bharat / state

టూలెట్ బోర్డులకు చలాన్లు వేయడం ఏంటి?: భాజపా కార్పొరేటర్లు - BJP Protest in GHMC Council Meeting

BJP Protest in GHMC Council Meeting : జీహెచ్‌ఎంసీలో హోర్డింగ్స్, అడ్వర్టైజ్‌మెంట్స్‌పై పాలక మండలి సర్వసభ్య సమావేశంలో భాజపా కార్పొరేటర్లు ప్రశ్నించారు. టూలెట్ బోర్డులకు చలాన్లు వేయడం ఏంటి? అని ధ్వజమెత్తారు.

టూలెట్ బోర్డులకు చలాన్లు వేయడం ఏంటి?: భాజపా కార్పొరేటర్లు

author img

By

Published : Sep 20, 2022, 3:51 PM IST

Updated : Sep 20, 2022, 5:05 PM IST

టూలెట్ బోర్డులకు చలాన్లు వేయడం ఏంటి?: భాజపా కార్పొరేటర్లు

జీహెచ్‌ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెరాస, భాజపా కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీలో హోర్డింగ్స్, అడ్వర్టైజ్‌మెంట్స్‌పై భాజపా కార్పొరేటర్లు ప్రశ్నించారు. టూలెట్ బోర్డులకు చలాన్లు వేయడం ఏంటి? అని ధ్వజమెత్తారు.

టూలెట్ బోర్డులకు మినహాయింపు ఇవ్వాలని భాజపా కార్పొరేటర్లు మేయర్‌ను కోరారు. టూలెట్ బోర్డులకు అక్రమంగా చలాన్లు వసూలు చేస్తున్నారని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు.

అక్రమంగా ఉన్న పోస్టర్లు, బ్యానర్లకు జరిమానా వేస్తున్నామని ఈవీడీఎం డైరెక్టర్ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) వెల్లడించారు. సొంత ఇంటికి పెట్టుకునే టూలెట్ బోర్డులకు ఎలాంటి ఫెనాల్టీ లేదని వెల్లడించారు. గతంలో 2 టూలెట్ బోర్డులకు తెలియక జరిమానా పడితే సవరించామని చెప్పారు. 95 శాతం సోషల్ మీడియాలో చేసిన కంప్లైంట్ ఆధారంగా జరిమానా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

దోమల బెడద ఉంటే ప్రభుత్వం కరెంటుఛార్జీలు పెంచిందని భాజపా నేతలు ఆరోపించారు. భాజపా నేతల వ్యాఖ్యల పట్ల తెరాస నాయకులు అభ్యంతరం తెలిపారు. భాజపా రైతుల మోటార్లకు మీటర్లు పెడుతుందంటూ తెరాస ఆరోపణలు చేసింది. పరస్పర ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది.

ఇవీ చదవండి..

Last Updated : Sep 20, 2022, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.