ETV Bharat / state

రాష్ట్రంలో కోలాహలంగా సద్దుల బతుకమ్మ వేడుకలు - bathukamma celebrations

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కోలాహాలంగా సాగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో సాయంకాల వేళ మహిళలు ఆడిపాడారు. ఊరు, వాడ తేడా లేకుండా పూల పండగను జరుపుకున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా పలు చోట్ల మాస్కులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.

bathukamma festival celebrations in telangana
రాష్ట్రంలో కోలాహలంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
author img

By

Published : Oct 24, 2020, 9:31 PM IST

Updated : Oct 24, 2020, 10:59 PM IST

రాష్ట్రంలో కోలాహలంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సహా విదేశాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌. కరోనాను దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ బతుకమ్మ ఆడారు.

రవీంద్రభారతిలో వేడుకలు

తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ రవీంద్రభారతిలో వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకల్లో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్... కొవిడ్ దృష్ట్యా దసరావేళ ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఆడిపాడిన మహిళలు

రాష్ట్రంలోని పలు పట్టణాల్లో సందడి నెలకొంది. వరంగల్‌, హన్మకొండల్లో మహిళలు బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో..... కోలాటం ఆడుతూ సందడి చేశారు. కరీంనగర్‌, నిజామాబాద్‌లో మహిళలు, చిన్నారులు సందడి చేయగా... సిరిసిల్లలో యువతులు విద్యుత్ కాంతుల మధ్య ఆడిపాడారు.

ఎల్లలు దాటిన సంబురాలు

తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సింగపూర్‌లో... బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవీ చూడండి: 'చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే దసరా'

Last Updated : Oct 24, 2020, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.