ETV Bharat / state

బతుకమ్మ సంబురాలు సంతృప్తినిచ్చాయి: గవర్నర్ - రాజ్​భవన్​లో మహిళలకు చీరల పంపిణీ

హైదరాబాద్​ రాజ్​భవన్​లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు.

'బతుకమ్మ సంబురాలు నాకు సంతృప్తినిచ్చాయి'

author img

By

Published : Oct 23, 2020, 10:55 PM IST

తెలంగాణ సోదరిగా, ఆడబిడ్డగా రాజ్​భవన్​లో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా రాజ్​భవన్ మహిళా ఉద్యోగులు, కుటుంబాలకు చెందిన మహిళలకు గవర్నర్ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవనంలో ఒక భాగమైన ప్రత్యేక పండుగ అన్న తమిళిసై... ఆడ బిడ్డల పండగ, ప్రకృతి, దైవం, పుట్టిన గడ్డతో మమేకమయ్యే విశిష్ఠమైన సందర్భమని వివరించారు.

బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలు ఇచ్చిపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరం, బలవర్ధకమైనవన్న గవర్నర్... మహిళల్లో పోషకత, ఆరోగ్యం పెంపొందుతుందని ఒక వైద్యురాలిగా తాను గమనించానని అన్నారు. బతుకమ్మను పేర్చేందుకు ఉపయోగించే పూలలో కూడా ఔషధ గుణాలుంటాయని... వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందని తెలిపారు.

వచ్చే ఏడాది కొవిడ్ రహిత పరిస్థితుల్లో బతుకమ్మను జరుపుకుందామని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై అవగాహన కలిగించేందుకు, రాజ్​భవన్​లో జరిగిన బతుకమ్మ వేడుకలు నేపథ్యంగా రూపొందించిన వీడియోను తమిళిసై విడుదల చేశారు.

ఇవీచూడండి: ఈనెల 29న ధరణి పోర్టల్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.