Bandi Sanjay comments on KCR: ప్రజాసమస్యలపై దృష్టి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వానాకాలం పంట ఎందుకు కొనరని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియా ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో మంత్రులంతా నామమాత్రంగా మారారని బండి సంజయ్ ఆరోపించారు. తెరాసను ఎదుర్కొనే సత్తా భాజపాకే ఉందని స్పష్టం చేశారు.
ప్రజాసమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకునే పరిస్థితి లేదు. వరి కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వానాకాలం పంట ఎందుకు కొనరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం కొత్త సమస్యలు సృష్టిస్తారు. కేసీఆర్ పాలనలో మంత్రులంతా నామమాత్రమే. కలెక్టర్లకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపుతున్నారు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
అప్పుడే ఆలోచించాల్సింది
Bandi Sanjay on paddy: ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని సంజయ్ అన్నారు. సంతకాలు పెట్టే ముందు ఆలోచించి పెట్టాలని హితవు పలికారు. కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రంలో భూసార పరీక్షలు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారని తెరాస ప్రచారం చేస్తోందన్న సంజయ్.. చైనా సహకారంతో కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారేమోనని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: Minister Puvvada: 'క్రాస్ బ్రీడ్లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. కానీ తెరాస వాళ్లంతా ఒరిజినల్ బ్రీడ్స్'