Awareness on Omicron : హైదరాబాద్ కొండాపూర్‌లో సియా లైఫ్ ఆస్పత్రి ఆధ్వర్వంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై అవగాహన నడక నిర్వహించారు. మహమ్మారి కట్టడికి ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మాస్క్ ధరించాలని సూచిస్తూ.. రాఘవేంద్ర కాలనీవాసులతో కలిసి ఆస్పత్రి సిబ్బంది 3కే వాక్ నిర్వహించారు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ నుంచి రాజరాజేశ్వరీ కాలనీవరకు ఈ నడక సాగింది.
Omicron Variant : రోజుకోరకంగా రూపం మార్చుకుని ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్న కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సియా లైఫ్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మనీంద్ర తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించడమే కాకుండా.. వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
గర్భిణులు అవగాహన లేకపోవడం వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం లేదని.. గర్భవతులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సియా లైఫ్ ఆస్పత్రి వైద్యురాలు సాహిత్య అన్నారు.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్' వేళ.. భారత్‌కు ఊరటనిచ్చే వార్త!