రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా క్యాబ్‌లకు అనుమతిస్తూ.. ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆటో డ్రైవర్ల ఐకాస కన్వీనర్ మహమ్మద్ అమానుల్లాఖాన్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధం చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర ఆటో డ్రైవర్ల ఐక్యత ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇవ్వాలని ఆటో పర్మిట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి