హైదరాబాద్‌లో ఓ ఆటోడ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు చరవాణి మర్చిపోవడంతో తిరిగివచ్చి ట్రాఫిక్ పోలీసులకు అందించాడు. దీంతో ఆటోడ్రైవర్ నిజాయతీకి ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఎస్సై అంజపల్లి నాగమల్లు పూలదండతో సన్మానించారు. మోహన్ నగర్ నుంచి ఆటోలో వచ్చిన ప్రయాణికుడు ఓమ్నీ ఆస్పత్రి వద్ద దిగి వెళ్లిపోయాడు.
ఆటో డ్రైవర్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్దకి వెళ్లిన తరువాత వెనక సీటులో చరవాణి ఉండడం గమనించాడు. తిరిగి వచ్చి కొత్తపేట సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అందులో ఉన్న నెంబరుకు ఫోన్ చేసి పొగొట్టుకున్న వ్యక్తికి చరవాణిని అందజేశారు. నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది యాదగిరి, సురేష్,రాజు పాల్గొన్నారు.