రాష్ట్రంలో దళిత బంధు పథకం (dalit bandhu) బాగుందని... ఆ తరహాలోనే ముస్లింలను కూడా ఆదుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (asaduddin owaisi) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణాలో ముస్లింలు అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో పాల్గొన్న ఓవైసీ... బీపీఎల్ కింద ఒక్కశాతం జనాభా నివసిస్తున్నారని.. సుమారు 18,000ల ముస్లీం కుటుంబాలు అందులోకి వస్తాయన్నారు.
అటువంటి పేద వారిలో ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున అందించాలని కోరారు. ఈ ఆర్థిక సహాయాన్ని రెండు విడతలుగా అందించవచ్చని సూచించారు. ఒక ఏడాదిలో రూ.5లక్షలు... మరో ఏడాదిలో మరో ఐదు లక్షల చొప్పున అందించవచ్చని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదరులకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం వల్ల వారి అభివృద్ధికి దోహదం చేసినవారవుతారని అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ను కోరారు. రాష్ట్రంలో ముస్లింల అక్షరాస్యత 77శాతం వరకు ఉందని అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయండి: కేంద్రానికి సీఎం విజ్ఞప్తి