ETV Bharat / state

హాట్​ హాట్​గా ఆంధ్ర రాజకీయాలు, అన్నా క్యాంటీన్​ ధ్వంసంతో మెుదలై ఎంత వరకు దారి తీశాయంటే

police arrested the tdp leaders రెండు మూడురోజులుగా కుప్పం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్​లో అతలాకుతలం చేస్తున్నాయి. చంద్రబాబుని అడ్డుకోవడంతో మెుదలై, తెదేపా నాయకులపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అన్నా క్యాంటీన్ ధ్వంసం అనంతరం చంద్రబాబు పాదయాత్ర, తర్వాతి పరిణామాలు అన్ని తెదేపా కార్యకర్తలు, నాయకులపై పోలీసు కేసులు ప్రారంభమయ్యాయి. దాంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఘర్షణలు చలరేగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

police arrested the tdp leaders
police arrested the tdp leaders
author img

By

Published : Aug 27, 2022, 8:36 PM IST

police arrested the tdp leaders: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం సంఘటనకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ఆ సందర్బంగా జరిగిన లాఠీచార్జీ తదితర సంఘటనల్లో మరో మూడు కేసులు నమోదయ్యాయి. కుప్పం నియోజకవర్గంలో తెదేపా నేతల అరెస్టుల పర్వం మెుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు పలు కేసులు నమోదుచేసి అరెస్ట్​లు ప్రారంభించారు.

రామకుప్పం మండలం కల్లుపల్లిలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మాజీ శాసనమండలి సభ్యుడు గౌనిగాని శ్రీనివాసులతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసుల్లో గౌనిగాని శ్రీనివాసు, మణి, జాకీర్​లను అరెస్ట్ చేశారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే అరెస్ట్​లు ప్రారంభమవ్వడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.