ETV Bharat / state

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం... సంబురాల్లో కార్మికులు - ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

నూతన సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు కొత్త కానుక తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు సర్కారు నిర్ణయించడంతో వారి చిరకాల కోరిక నెరవేరింది. నేటి నుంచి ప్రభుత్వంలో సరికొత్తగా ఆవిర్భవించిన ప్రజారవాణా విభాగం కింద వారంతా పనిచేయనున్నారు. కొత్త ఏడాది, విలీనాన్ని కలిపి ఒకేసారి కార్మికులు వేడుకలు చేసుకుంటున్నారు.

apsrtc-merging-in-government
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం... సంబరాల్లో కార్మికులు
author img

By

Published : Jan 1, 2020, 8:14 AM IST

Updated : Jan 1, 2020, 8:43 AM IST

ఏపీఎస్​ఆర్టీసీ ఉద్యోగులంతా నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఆర్టీసీలోని 54 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్... ఆర్టీసీని ప్రజారవాణా విభాగం కిందికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిపుణుల కమిటీలోని సభ్యులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని సిఫార్సు చేసింది.

ఉద్యోగ విరమణ పెంచుతూ నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తోన్న 54 వేల మంది ఉద్యోగులందరూ ఈ శాఖ కిందకు వస్తారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్సు ఛార్జీలు ఫెయిర్‌గా ఉండేలా ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు.

కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ ఉద్యోగులు

75 ఏళ్లకు పైబడి సుధీర్ఘ సేవలందిస్తూ, ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందిన ఆర్టీసీ... గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ప్రతీరోజూ సుమారుగా 85 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. సంస్థకు ఘన చరిత్రను అందించడంలో ఆ సంస్థ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారు. ఇకపై వారంతా ప్రజా రవాణా వ్యవస్థ కింద విధులు నిర్వహించనున్నారు. ప్రజారవాణా విభాగంలో విలీనం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మరణిస్తున్న ఘటనలపైనా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీలో సుమారు 54 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటి వరకు కంటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా... సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని తన భుజాన వేసుకుంది. నేటి నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల... సంస్థ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్ర ప్రజలకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Intro:Body:Conclusion:
Last Updated : Jan 1, 2020, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.