ETV Bharat / state

పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణ అక్కర్లేదు: ఏపీ హైకోర్టు

author img

By

Published : Jan 20, 2021, 12:07 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పింక్‌ డైమండ్‌ విషయంలో దాఖలైన పిటిషన్​లో జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణ అక్కర్లేదు: ఏపీ హైకోర్టు
పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణ అక్కర్లేదు: ఏపీ హైకోర్టు

తితిదేకు చెందిన పింక్ డైమండ్ విషయంలో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిల్​లో జోక్యానికి ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రెండు కమిటీలు విచారణ జరిపి నివేదికలు ఇచ్చాయన్న ధర్మాసనం.. మరోసారి విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

శ్రీవారికి మైసూర్ మహారాజా సమర్పించిన పింక్ డైమండ్ విషయంలో విచారణకు ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం అధికార ప్రతినిధి విద్యాసాగర్ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రసాద్ బాబు వాదనలు వినిపిస్తూ... పింక్ డైమండ్, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో వేలం వేసిన పింక్ డైమండ్ ఒకటేనా.. కాదా అనే విషయాన్ని తేల్చేందుకు విచారణ జరపాలని కోరారు. దీనిపై తిరుపతిలోని మూడో అదనపు జిల్లా కోర్టులో పరువునష్టం దావా వేసిందన్నారు. పిటిషనర్ వాదనలు తోసిపుచ్చిన ధర్మాసనం... వ్యక్తిగత హోదాలో పలువురిని ప్రతివాదులుగా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగం... డయాగ్నోస్టిక్​ హబ్​కు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.