ETV Bharat / state

ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో మద్యం, ఇసుక అక్రమాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్​‌మెంట్‌ బ్యూరో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంటెలిజెన్స్, ఏసీబీలానే ఈ వ్యవస్థ పూర్తి స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట
ఏపీలో మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట
author img

By

Published : May 9, 2020, 8:16 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ పోస్టు స్థానంలో దీనిని ఏర్పాటు చేస్తారు. దీనికి స్వతంత్రంగా పనిచేసే కమిషనర్‌ నేతృత్వం వహిస్తారు. ఇంటెలిజెన్స్‌, నిఘా విభాగాల్లానే ఈ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయనుంది. ఇది డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. ఈ బ్యూరో కింద సరిహద్దు జిల్లాల్లో ఐపీఎస్‌ స్థాయి అధికారిని, మిగతా చోట్ల ఏఎస్‌పీ స్థాయి అధికారిని నియమిస్తారు.

ఎక్సైజ్‌శాఖలో అధిక భాగం ఈ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. దీని ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎక్సైజ్‌ కమిషనర్‌ లైసెన్స్‌లు, స్టాక్‌, విక్రయాలు, ఉత్పత్తి వంటి రోజువారీ అంశాలు మాత్రమే చూస్తారు. కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఆయన పర్యవేక్షణలో ఉంటారు. మిగతా సీఐలు, ఎస్సైలు వంటి వారంతా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో పరిధిలోకి వస్తారు. మద్యం అక్రమ తయారీ, రవాణాను అడ్డుకోవడం, ఇసుక అక్రమాలను నిరోధించడం దీని ప్రధాన విధులు.

ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.