ETV Bharat / state

అన్ని శాఖల సమన్వయంతో కరోనాపై పోరు: డీజీపీ - ఏపీలో కరోనా కేసు వివరాలు

కరోనా నియంత్రణకు పోలీసులు కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ కరోనాపై పోరును కొనసాగిస్తామని వెల్లడించారు. ఇకపై లాక్​డౌన్ అమలు మరింత కఠినంగా ఉంటుందని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో రాజకీయాలకు తావు లేదన్నారు.

ap-dgp-gowtham-sawang-press-meet
అన్ని శాఖల సమన్వయంతో కరోనాపై పోరు
author img

By

Published : Apr 25, 2020, 5:02 PM IST

అనంతపురంలో లాక్‌డౌన్‌ పరిస్థితులను ఆంధ్రప్రదేశ్​ డీజీపీ గౌతం సవాంగ్‌ సమీక్షించారు. కరోనా నియంత్రణకు పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.‌ రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించనున్నట్లు గౌతం సవాంగ్‌ వివరించారు. విదేశాలు, దిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా కేసులు పెరిగాయన్న డీజీపీ.. 22,600 మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తించామన్నారు. అన్నిశాఖలను సమన్వయం చేసుకుంటూ కరోనాపై పోరును కొనసాగిస్తామని వెల్లడించారు.

కరోనా నియంత్రణ చర్యల్లో వైద్యులు కృషి ఉన్నతమైనదని డీజీపీ కొనియాడారు. కరోనా వైరస్‌ నియంత్రణ అనేది జాతీయ విపత్తన్న ఆయన ..కరోనా నియంత్రణ చర్యల్లో రాజకీయాలకు తావులేదన్నారు. వ్యవసాయ రంగం, పారిశ్రామికీకరణపై కరోనా ప్రభావం పడిందని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మరికొన్ని రోజులు ప్రజలు సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లకు మాత్రమే పరిమితమై కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా నివారణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మాస్కులు, పీపీఈ కిట్ల కోసం నిధులు కేటాయించారని ఈ సందర్భంగా తెలిపారు.

ఇవీ చదవండి: ఐఐటీ కిట్​తో అతి చౌకగా కరోనా పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.