ETV Bharat / state

ap CM Jagan on OTS : 'ఆ విషయంలో బలవంతం చేయబోం' - ఏపీలో ఓటీఎస్​ పథకం

ap CM Jagan on OTS: ఏపీ ముఖ్యమంత్రి జగన్... ఓటీఎస్‌ పథకం, గృహనిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలని అధికారులకు సూచించారు. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు.

ap CM Jagan on OTS
ap CM Jagan on OTS
author img

By

Published : Dec 8, 2021, 2:35 PM IST

ap CM Jagan on OTS: ఓటీఎస్ వినియోగించుకోవాలా? వద్దా? అనేది ప్రజల ఇష్టమేనని, ఇందులో బలవంతం ఏమీ లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఓటీఎస్‌ పథకం, గృహనిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, అర్థం చేయించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు.

ప్రజలు ఈ పథకాన్ని వద్దనుకుంటే.. అవసరం లేదని చెప్పారు. అయితే.. ఈ పథకం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఓటీఎస్ ద్వారా పట్టా పొందితే.. ఆ ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని, కావాలంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని సీఎం చెప్పారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని వెల్లడించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాల సంపూర్ణహక్కులూ ఇంటి యజమానులకు లభిస్తాయని తెలిపారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న జగన్‌.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది ప్రజల ఇష్టమేనని చెప్పారు. ఈనెల 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇస్తామని చెప్పారు.

ఇక, ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు జగన్. దీని ద్వారా.. ఏరకంగా మంచి జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఈ పథకం ద్వారా.. రూ.10 వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని చెప్పారు. పేదలకు రుణాలు మాఫీచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: CEC warns to Panchayati Raj : జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు గ్రాంట్లు విడుదలపై సీఈసీ సీరియస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.