ETV Bharat / state

Amith Shah Telangana Tour :​ రాజమౌళితో భేటీ కానున్న అమిత్​ షా.. - ఎస్​ఎస్​ రాజమౌళి

Mahajan Sampark Abhiyan In Khammam : ఈ నెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా తెలంగాణ రానున్నారు. ఖమ్మంలో నిర్వహించే మహాజన్​ సంపర్క్​ అభియాన్​లో భాగంగా భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఎస్​ఎస్​ రాజమౌళిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

amith shah
amith shah
author img

By

Published : Jun 13, 2023, 8:52 PM IST

Updated : Jun 13, 2023, 10:50 PM IST

Amit Shah Will Meet SS Rajamouli In Hyderabad : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఖమ్మం బహిరంగ సభ నేపథ్యంలో.. 14వ తేదీన రాత్రి 12 గంటలకు శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అదే రోజు రాత్రి శంషాబాద్​లోని నోవాటెల్​ హోటల్​లో బస చేయనున్నారు. మహాజన్​ సంపర్క్​ అభియాన్​లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ 15వ తేదీన నిర్వహించే.. బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.

15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 30 నిమిషాల పాటు కేంద్రమంత్రి అమిత్​ షా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీయనున్నారు. అలాగే మహాజన్​ సంపర్క్​ అభియాన్​లో భాగంగా టాలీవుడ్​ దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళితో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీతో ఇటు రాజకీయ వర్గాల్లోనూ.. అటు టాలీవుడ్​ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. అయితే స్వయంగా అమిత్​ షా వారి నివాసాలకు వెళ్లి కలవనున్నట్లు విశ్వసనీయం సమాచారం. తరువాత ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతోనూ భేటీకానున్నారు.

భద్రాద్రి రామయ్య దర్శనం : మధ్యాహ్నం 12.45 నుంచి 2 గంటల వరకు శంషాబాద్​ జేడీ కన్వెన్షన్​ హాల్​లో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి.. వారితో ముచ్చటించనున్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశం ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్​లో భద్రాచలంకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ భద్రాద్రి సీతారాములను దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

సాయంత్రం ఆరు గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ ప్రసంగంలో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ఎలా పనిచేయాలో పార్టీశ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్​కు బయలుదేరి వెళ్లనున్నారు.

Amit Shah Will Come To Telangana on 15th June : కేంద్రమంత్రిగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు.. బీజేపీ బహిరంగ సభలకు వెళ్లినప్పుడు సమాజంలో గుర్తింపు పొందిన వివిధ వర్గాల ప్రముఖులను అమిత్​ షా కలవడం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా హైదరాబాద్​ పర్యటనకు వచ్చినప్పుడు జూ. ఎన్టీఆర్​, మిథాలీ రాజ్​, నితిన్​ వంటి ప్రముఖులను కలిశారు. రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలను ఉపయోగించుకుంటుంది. దేశవ్యాప్తంగా బీజేపీ తరఫున కీలకమైన నేతలను తెలంగాణలో పర్యటించేలా చేస్తున్నారు. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హైదరాబాద్​లో రెండు సార్లు పర్యటించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 13, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.