లాభాల్లో నడుస్తున్న రైల్వేను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బోస్ తెలిపారు. రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైల్వేలను ప్రైవేటుపరం చేసి కార్మికుల పొట్ట కొట్టడం సమంజసం కాదని సీపీఐ నేతలు ఆరోపించారు. ప్రజల సంపదను లూటీ చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసిందన్నారు. రైల్వే ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు