ETV Bharat / state

Alleti Maheshwar Reddy: కాంగ్రెస్​కు రాజీనామా చేసి.. కమలం గూటికి చేరిన మహేశ్వర్​రెడ్డి

author img

By

Published : Apr 13, 2023, 2:38 PM IST

Updated : Apr 13, 2023, 5:09 PM IST

Alleti Maheshwar Reddy resigns to Congress : మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపించారు. తన రాజీనామా అనంతరం దిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయి.. కాషాయ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి మహేశ్వర్‌రెడ్డి రాజీనామా.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ

Alleti Maheshwar Reddy resigns to Congress : ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్​ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై బుధవారం రోజున స్పందించిన మహేశ్వర్‌రెడ్డి.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ అయిన తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అర్హత పీసీసీకి లేదన్నారు. సోషల్ మీడియాలో ఏదో వస్తే దానికి తానెలా బాధ్యత వహిస్తానని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే వద్దే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు నేడు దిల్లీ వెళ్లారు.

ఈ క్రమంలోనే మహేశ్వర్‌రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నానన్న ఆయన.. ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 26 తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఇవాళ తనను ఎవరు ఆహ్వానించినా.. వారిని కలుస్తానని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఇంతలోనే ఇలా బీజేపీలో చేరారు.

''తీవ్ర మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశా. ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేదు. ఈ నెల 26 తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటా. ఇవాళ నన్ను ఎవరు ఆహ్వానించినా వారిని కలుస్తా.'' - మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్

కాంగ్రెస్​కు మహేశ్వర్‌ రెడ్డి రాజీనామా

ఖర్గే అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నం..: దిల్లీలో ఉన్న మహేశ్వర్‌రెడ్డి రాజీనామాకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. ఖర్గేతో మాట్లాడి భవిష్యత్‌ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఖర్గేను కలిసే అవకాశం రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా.. బీజేపీలో చేరిక : అనంతరం మహేశ్వర్‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ నివాసానికి వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి దిల్లీలోని తరుణ్‌ చుగ్‌ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌, ఈటలతో కలిసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.

ఇవీ చూడండి..

'నాకు నోటీసు ఇచ్చే అర్హత పీసీసీకి లేదు?.. ఆయన వద్దే తేల్చుకుంటా..!'

ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయాలనుకోవట్లేదు: కేంద్ర మంత్రి ఫగ్గన్‌

Last Updated : Apr 13, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.