పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 466వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, తాడికొండ మండలం మోతడకలో రైతులు, మహిళలు నిరసన దీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు, మహిళలు భౌతిక దూరం పాటిస్తూ ఆందోళనను కొనసాగించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ మోతడక రైతులు అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అసైన్డ్ భూములు కొనుగోలు అక్రమమన్న మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి..పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదా.. అని మహిళా రైతులు ప్రశ్నించారు.